పరిచయం లేనివారి పట్ల ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని తూ. గో జిల్లా మహిళా రక్షక్ టీం సభ్యులు తెలిపారు. శనివారం కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద బాలికా రక్షణ అవగాహన సదస్సు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనునిత్యం మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నారు.