రాజమండ్రి రూరల్:  ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

56చూసినవారు
రాజమండ్రి రూరల్:  ఘనంగా జాతీయ గణిత దినోత్సవం
రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో శనివారం శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ప్రిన్సిపల్ జయశ్రీ శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైట్ విద్యార్థినులు గణితం ఉపయోగాలపై అవగాహన కల్పించేందుకు స్కిట్లను ప్రదర్శించారు. సీనియర్ లెక్చరర్ కేవీ సూర్యనారాయణ పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్