ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని, వెంటనే వర్గీకరణ అమలును నిలిపివేయాలని భారత రిపబ్లికన్ పార్టీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు జ్ఞానప్రకాశ్ ఆదివారం కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతిని కలిసి వినతిపత్రం అందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. తీర్పు అమలు చేయకూడదు అన్నారు.