నల్లజర్ల మండల వైద్య ఉద్యోగులు అందరికీ ఆరోగ్యం అదే మా లక్ష్యం అనే నినాదంతో దూబచర్లలో ప్రత్యేక కార్యక్రమాన్నిమంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం,గర్భస్థ శిశు మరణాల జ్ఞాపకార్ద దినోత్సవం, ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం వంటి మూడు ముఖ్య కార్యక్రమాలను ఒకే చోట కలిపి నిర్వహించడం జరిగింది.స్వచ్ఛంద సేవా సంస్థ ఆమెన్ ట్రస్ట్ సహకారంతో ఈ అవగాహన సదస్సు డైట్ కళాశాలలో జరిగింది.