తూ. గో జిల్లాలో సహకారం రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖల వారి అధికారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణతో రానున్న సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సహకార సంఘాల 2025 -26 ఏడాది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ గా ప్రకటించడం జరిగిందన్నారు.