రాజానగరంలోని నన్నయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల క్రికెట్ పోటీలు గురువారం యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వీసీ వై. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ సుధాకర్, బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు హాజరయ్యారు. వీసీ బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. ఎంపిక అయిన జట్టు జనవరిలో చెన్నైలోని మోడ్రన్ యూనివర్సిటీలో జరిగే దక్షిణ భారత పురుషుల క్రికెట్ పోటీల్లో పాల్గొంటుందన్నారు.