రాజానగరం మండలం దివాన్చెరువులో గురువారం బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. మండపేట మండలం కేశవరానికి చెందిన చుక్కా శ్రీను(38) తన అత్తవారి గ్రామం శ్రీరాంపురానికి బయలుదేరాడు. దివాన్ చెరువు సెంటర్లో బైక్పై వెళుతున్న విద్యార్థి వెంకటరమణను శ్రీను లిప్ట్లిఫ్ట్ అడిగి ఎక్కాడు. శ్రీరాంపురం సెంటర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ప్రమాదంలో శ్రీను మృతి చెందగా, వెంకటరమణకు గాయాలయ్యాయి.