రాజానగరం: భూముల రీ సర్వే పేరుతో ఎన్నో అవకతవకలు

75చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల రీ సర్వే పేరుతో ఎన్నో అవకతవకలు జరిగాయని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన భూములలో రైతుల భూములను 22Aలో పెట్టడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్