కోరుకొండ మండలం నిడిగట్లలో ఎస్సీ ఫిషర్ మాన్ సొసైటీ చెరువులపై ఆధిపత్య, కుల వ్యక్తుల కుట్రలు జరుగుతున్నాయని స్వతంత్ర జనతా పార్టీ చీఫ్ బర్రే ఆనంద్ కుమార్ మండిపడ్డారు. ఆదివారం గ్రామస్థులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎస్సీలకు చెందాల్సిన చెరువుల్లో చేపలను అక్రమంగా తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారిన ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు.