
రాజానగరం: విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
రాజానగరం మండల చక్రద్వారబంధం గ్రామంలో ఈ నెల 15వ తేదీన శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆలయ కమిటీ సభ్యులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.