
సీతానగరం: ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుంచి జనసేనలోకి చేరిక
సీతానగరం మండలం వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షులు తన్నీరు త్రిమూర్తులు, మాజీ వార్డు సభ్యులు సోమవారం వైసీపీ నుంచి జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు వారు వెల్లడించారు.