

రాజానగరం: లారీ నుంచి యాసిడ్ లీకేజీ
రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రి వద్ద గురువారం తెల్లవారుజామున విశాఖ నుంచి దేవరపల్లి వెళుతున్న లారీ నుంచి యాసిడ్ లీకేజి అయ్యింది. ఈ ఘటనతో ఒక్కసారిగా వాహనచోదకులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రాజమండ్రి అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని యాసిడ్ లీకేజినీ అరికట్టారు. రాజానగరం పోలీసులు, హైవే పెట్రోలింగ్ టీమ్ ట్రాఫిక్కు ఏటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.