డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ పరిధిలోని కొత్తూరు రోడ్లో జోడు తూముల వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ వేద పండితుల మంత్రోచరణల మధ్య సన్నాయి మేళాలతో మంత్రికి స్వాగతం పలికారు. అమృతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూటమి నాయకులు పాల్గొన్నారు.