మలికిపురం మండలంలోని గుడిమెల్లంక సురక్షిత తాగునీటి పథకాన్ని సోమవారం కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు. ఈ మేరకు తాగునీటి పథకానికి సంబంధించి నూతనంగా చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. అదేవిధంగా సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.