పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఆయన శుక్రవారం రాజోలులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అదేవిధంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే, ఎంపీపీ కేత శ్రీనివాస్, సర్పంచ్ రేవు జ్యోతి పాల్గొన్నారు.