రాజోలు: డ్రైన్ నిర్మాణ పనులకు ఎంపీపీ శంకుస్థాపన

81చూసినవారు
రాజోలు మండలం ములికిపల్లిలో మండల ప్రజా పరిషత్ నిధులు రూ. 3 లక్షలతో రజక వారి గ్రూపులో నిర్మించనున్న డ్రైన్ నిర్మాణ పనులకు ఎంపీపీ కేతా శ్రీనివాస్ శనివారం శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులకు, ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అనుగుణంగా పనిచేస్తుందన్నారు. గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్