రాజోలు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ కె. రామకృష్ణను విజయవాడలో గురువారం రాజోలు నియోజకవర్గ సీపీఐ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం కౌలు రైతుల ఇళ్ల సమస్ను, నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.