శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో మహిళలు భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి అమ్మవారికి పూజలు చేశారు. తుని మండలం ఎస్ అన్నవరంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. నవకలశ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. నవకలశ, సన్నవం, గరుడ ప్రసాద వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.