తొండంగి మండలం పెరుమాళ్లపురంలో అరబిందో ఫార్మా ద్వారా విడుదలవుతున్న కాలుష్యం, దుర్వాసన, శబ్దాలు వలన ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని ఏవీ నగరం, కోదాడ, రైతులు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు కలెక్టర్ ను కలిసి సంస్థ సముద్రంలో విడుదల చేస్తున్న వ్యర్థాలు వల్లన మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు.