గ్రామ అభివృద్ధి అవసరాలు గ్రామస్తుల ద్వారా తెలుసుకొని గ్రామ సభ ఆమోదం పొంది సమస్యలకు పరిష్కారం చూపటం గొప్ప కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ డీ. కే. బాలాజీ అన్నారు. శుక్రవారం చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మన పంచాయతీ - మన సాధికారత గ్రామసభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ డీ. కే. బాలాజీ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.