నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద గ్రామానికి చెందిన కొప్పనాతి బాలరాజు అనే వ్యక్తి.. తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు నాగాయలంక ఎస్ఐ కె. రాజేష్ కు సమాచారం అందింది. శనివారం కొప్పనాతి బాలరాజు నాగాయలంక నుంచి అక్రమంగా మద్యం సీసాలు తరలిస్తున్నట్లు సమాచారంతో ఎస్ఐ కె. రాజేష్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా బాలరాజు పట్టుకుని తనిఖీ చేశారు. 25 మద్యం సీసాలు ఉండటంతో బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.