అవనిగడ్డ: రాజ్యాంగం ఇచ్చిన ఓటుహక్కుతో బుద్ది చెప్పారు

62చూసినవారు
రాజ్యాంగాన్ని గౌరవించని పాలకులకు ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన ఓటుహక్కుతో బుద్ది చెప్పారని ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు. మంగళవారం అవనిగడ్డ నేరెళ్ళపాలెం బస్ స్టాప్ సెంటరులో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వెంకట్రామ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్