ఆకు చుట్టు పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నవీన్ కుమార్ అన్నారు. బుధవారం ఘంటసాల మండల పరిధిలోని యండకుదురు, లంపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ నివారణకు గానూ ప్లూబెండమైడ్ 0. 1 మిల్లీ లీటరు లేదా క్లోరాంథ్రనిల్ ప్రోల్ 0. 3 మిల్లీ లీటరు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు.