పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ వివిపిఎస్. ఆంజేయులు అన్నారు. లయన్స క్లబ్ రీజియన్ చైర్పర్సన్ యు. రాంబాబు ఆర్థిక సహకారంతో జాతీయ రహదారికి పక్కనే 50 పండ్ల మొక్కలను బుధవారం నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ ఆంజనేయులు ముఖ్య అతిధిగా పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ చల్లపల్లి సారధి డాక్టర్ డిఆర్. కె. ప్రసాద్ పాల్గొన్నారు.