కృష్ణా నది వరద ప్రవాహంతో పూర్తిగా నీటమునిగిన ఆముదార్లంక గ్రామస్తులు చల్లపల్లిలోని జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన శిబిరాలలో తలదాచుకుంటున్నారు. చల్లపల్లి విజయ పబ్లిక్ స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 200 కుటుంబాలకు రూ. 70 వేలు విలువ చేసే బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులను గురువారం అందించారు. ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.