ఎన్. డీ. యే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మన పంచాయతీ, -మన సాధికారత గ్రామసభలు గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన అవనిగడ్డలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అవనిగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామసభలు విజయవంతం అయినట్లు తెలిపారు.