రైతులను వీడని నీటి ముంపు

64చూసినవారు
రైతులను వీడని నీటి ముంపు
వాయుగుండం ప్రభావంతో వర్షం కురిసి పది రోజులు కావస్తున్నప్పటికీ రైతులను మాత్రం ముంపు విడటం లేదు. కోడూరు శివారు 15 నెంబర్ పంట కాలవ క్రింద నారుమడులు నేటికీ నీటిలోనే మునిగి తేలుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట పొలాలలో నుంచి వర్షపు నీరు బయటికి పోయే స్లూయిస్ వద్ద డ్రైనేజీ అధికారులు వేసిన అడ్డు కట్ట మూలంగా నీరు సముద్రంలోకి పోవడం లేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్