మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు గొప్ప మానవతావాది అని రాష్ట్ర మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 27వ వర్ధంతి పురస్కరించుకొని బస్టాండ్ సెంటరులో కృష్ణారావు విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజా పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరతరాలుగా తరగని అభిమాన ధనమే మండలి వారింటి తరగని సంపద అన్నారు.