అవుట్ పాల్స్ వద్ద ఇసుక మూటలు తొలగించాలని వేడుకోలు

82చూసినవారు
కోడూరు మండలం పాలకాయ తిప్ప అవుట్ ఫాల్స్ స్లూయిస్ వద్ద నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇసుక మాటలను తొలగించండి మహా ప్రభో అంటూ సోమవారం రైతులు కోరుతున్నారు. వాయుగుండం ప్రభావంతో గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీటమడిగిన విషయం విదితమే. కానీ వర్షం తగ్గి నాలుగు రోజులవుతున్నప్పటికీ కోడూరు శివారు గ్రామాల సమీపంలోని పంట పొలాలలోని వర్షపు నీరు మాత్రం బయటికి పోవడం లేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్