స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చల్లపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ జనసేన నాయకులు మండలి వెంకట్రామ్ వారిని సన్మానించి, నూతన వస్త్రాలు, పండ్లు అందచేశారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి దినదినాభివృద్ధి చెందుతుందని తెలిపారు.