విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద 11 లక్షలకు పైగా విడుదల చేసిన వరద నీరు సోమవారం రాత్రి 12 గంటలకు కృష్ణాజిల్లా దివిసీమకు చేరింది. ఈ వరద నీరు అంతా హంసలదీవి, ఎదురుమొండి వద్ద సముద్రంలో కలవనున్నది. పులిగడ్డ అక్విడక్ట్ వద్ద 28 అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహిస్తోంది. దీనితో దివిసీమ ప్రజలు గడ గడ వణికిపోతున్నారు. మోపిదేవి మండలం, ఉత్తర చిరువోల్లంక లాకుల వద్ద కరకట్ట పై రెండు అడుగుల ఎత్తులోకి వరద నీరు చేరింది