తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని అందరికీ ఆదర్శప్రాయుడుగా నిలిచిన అజాత శత్రువు చింతా వేంకటేశ్వరరావు అభినందనీయుడని ప్రముఖ డాక్టర్ దూట్టా రామచంద్ర రావు అన్నారు. కృష్ణా టాకీస్ అధినేత, పారిశ్రామిక వేత్త చింతా వేంకటేశ్వరరావు సంతాప సభ బుధవారం గన్నవరం లోని కాకాని కళ్యాణ మండపం లో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న డాక్టర్ దుట్టా మాట్లాడారు.