డా బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దండువీరయ్య మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తీన్ మూర్తి చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అమర్తల సోమేశ్వర రావు, ఆర్ ప్రకాశ రావు, జి రవి, ఆర్ విమల్ కుమార్, ఎన్ బుజ్జి పాల్గొన్నారు.