ఉంగుటూరు మండలంలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని ఎంపీడీవో జి.ఎస్ వి. శేషగిరిరావు అన్నారు. సోమవారం మండలంలోని ముంపు గ్రామాలను తమ సిబ్బందితో కలిసి పర్యటించిన శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ.. తుఫాను కారణంగా మండలంలోని వెల్దిపాడు, ఎలుకపాడు, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడు, ఆత్కూరు, పెద్దాఆవుటపల్లి, వేంపాడు, తరిగొప్పల గ్రామాలలో వరద బాధితులకు పునరావాసం ఏర్పాటు చేశామన్నారు.