గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం ఎలుకపాడు గ్రామాన్ని బుధవారం వరద నీరు చుట్టుముట్టింది. అలాగే ఎలుకపాడు గ్రామాన్ని ఆనుకుని ఉన్నటువంటి బుడమేరు కూడా ఉధృతితో ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళలో వరద నీరు చేరడంతో వరద బాధితులు చర్చిలలో తలదాచుకుంటున్నారు. గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు సముద్రాన్ని తలపిస్తోంది. వరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి.