కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నందివాడ మండలం పుట్టగుంట గ్రామ సమీపంలో ఉన్నటువంటి బుడమేరు నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ గంగాధరరావుతో కలిసి కలెక్టర్ డీకే బాలాజీ బుడమేరు నీటి ప్రవాహాన్ని పరిశీలించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం కోసం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయా శాఖల అధికారులు ఆదేశించారు.