కాలువలు, డ్రైన్లలో నీటి ప్రవాహా అడ్డంకులను యుద్ధ ప్రాతిపదిగిన తొలగించాలంటూ గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నందివాడ మండలంలోని వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. మారుమూల ముంపు ప్రాంతాలకు సైతం వెళుతూ ప్రజల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే రాము వివరించారు. అనమనపుడి ప్రజలను సురక్షిత ప్రాంతాల తరలింపుకు చర్యలు చేపట్టారు.