వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా నష్ట అంచనాల రూపకల్పన పకడ్బందీగా జరుగుతున్నాయని రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వం ఉందని నష్టపోయిన రైతులెవరు ఆందోళన చెందనవసరం లేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మంగళవారం గుడివాడ రూరల్ మండలంలోని వరద ముంపు బాధిత రైతులను ఆయన పరామర్శించారు. మండలంలోని తట్టివర్రు, రామనపూడి గ్రామాల్లో ఎమ్మెల్యే రాము పర్యటించారు.