ఎన్ టి ఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. కరుణ, ప్రేమ, క్షమ సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తమ జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపధం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిద్దేశం చేశారని అన్నారు.