ముదినేపల్లి : బెల్టు షాపులపై పోలీసుల దాడి

81చూసినవారు
ముదినేపల్లి : బెల్టు షాపులపై పోలీసుల దాడి
ముదినేపల్లి మండలం వైవాక గ్రామంలో అనధికారికంగా మద్యం నిల్వలు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు, ముదినేపల్లి ఎస్ఐ వీరభద్రరావు తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించి, ముగ్గురిని అరెస్టు చేసి 120 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్