మచిలీపట్నంలో ఉద్యోగ విరమణ చేసిన విఆర్ఓ ఇంట్లో చోరీ జరిగింది. అనారోగ్య కారణంగా వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి వెళ్ళి బుధవారం తిరిగి వచ్చి ఇల్లును చూసేసరికి తలుపులు బద్దలు కొట్టి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.