మచిలీపట్నం: విద్యుత్ ఘాతానికి గురై మృతి

81చూసినవారు
మచిలీపట్నంలో ఓ యువకుడు విద్యుత్ ఘాతానికి గురై శుక్రవారం మృతి చెందాడు. పెదపట్నం గ్రామంలో చేపల చెరువుకు కాపలా ఉంటున్న ధృవ (25) మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడిని మోటార్ సైకిల్ పై మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్