లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మంగళవారం మచిలీపట్నంలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వంపై నమ్మకంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారన్నారు. సిండికేట్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదన్నారు. చదువుకున్న వారితో పాటు మహిళలు కూడా మద్యం టెండర్లలో పాల్గొన్నారన్నారు.