పిసిపిఎన్డి చట్టం అమలు వివరిస్తూ ముద్రించిన కరపత్రాలు, బ్యానర్లను కలెక్టర్ డీ. కే. బాలాజీ మంగళవారం మచిలీపట్నంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమే అని, స్త్రీ - పురుషుల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదన్నారు. నిజానికి పురుషుడు కంటే స్రీ ఏ విషయంలోనూ తక్కువ కాదన్నారు. అందుకే ఈనాడు అన్ని రంగాలలో స్త్రీలు పురుషులతో పోటీ పడుతున్నారని కలెక్టర్ తెలిపారు.