రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ను విచారిస్తున్న పోలీసులు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాను గురువారం సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గోవా నుండి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం జానీ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. జానీని రహస్య ప్రదేశంలో ఉంచి.. పోలీసులు విచారిస్తున్నారు. గోవా కోర్టు ఆదేశాల మేరకు నేడు అతడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుచనున్నారు.