ఎమ్మెల్యే ను కలిసిన సాయిబాబా గుడి నిర్మాణ కమిటీ సభ్యులు

79చూసినవారు
ఎమ్మెల్యే ను కలిసిన సాయిబాబా గుడి నిర్మాణ కమిటీ సభ్యులు
కొండపల్లి పట్టణం లోని బీ కాలని వద్ద నిర్మాణం అవుతున్న శ్రీ షిరిడి సాయిబాబా గుడి నిర్మాణ కమిటీ సభ్యులు శుక్రవారం నాడు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో గుడి నిర్మాణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వసంత ను శాలువా మరియు కొండపల్లి బొమ్మ ఇచ్చి సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గుడి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్