మైలవరం ఎమ్మెల్యే గా రెండోసారి ఎన్నికైన వసంత కృష్ణ ప్రసాద్ ను శుక్రవారం మైలవరంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద నాగమల్లేశ్వరరావు, జి కొండూరు మండల అధ్యక్షులు కోప్పూరు ఏడుకొండల నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని కలిసి శాల్వతో ఘనంగా సన్మానించారు.