అంతర్జాతీయ ఐ యస్ ఓ గుర్తింపు పొందిన మదర్ సర్వీస్ సొసైటీ కార్యాలయాన్ని శనివారం రెడ్డిగూడెం టీడీపీ సీనియర్ నేత ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు) సందర్శించారు. వృద్ధులు, నిరుపేదలు, నిరాశ్రయుల కోసం చేస్తున్న సేవలను ప్రశంసించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ పెద్దబాబు మానవత్వాన్ని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.