కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత

84చూసినవారు
కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత
గూడూరు మండలం కంకటావ, షా అబ్దుల్లాపాలెం, లేళ్లగరువు గ్రామాల రైతులతో కలిసి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మంగళవారం మామిడికోళ్ల కాలువను పరిశీలించారు. సమృద్ధిగా సాగునీరు రాకపోవటంతో కాలువ కింద పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ఇరిగేషన్ ఎస్ఈకి ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్