హిందూ పండుగలకు మాత్రమే డీజేలను నిషేధించడం పట్ల పోలీస్ వైఖరిని మార్చుకోవాలని పెడన హిందూ బంధువు ఐక్యవేదిక ఛైర్మన్ నాదెళ్ల కోటేశ్వరరావు పోలీసుల తీరుపై శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గత వారం రోజుల నుంచి యువత, కమిటీ సభ్యులు డీజేలకు రూ. లక్షలాది అడ్వాన్స్లు ఇచ్చారన్నారు. అంతే కాకుండా కేవలం హిందూ మతస్తులకు చెందిన వాటికే డీజే లను నిషేధించడం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు.